కలం వెబ్ డెస్క్ : ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ తన లోపాలను అంగీకరించింది. కంపెనీ కంటెంట్ మోడరేషన్ (X Content Moderation) ప్రమాణాల్లో లోపాలు ఉన్నాయని, భవిష్యత్తులో అన్ని ప్రామాణిక చట్టాలు, నియమాల ప్రకారం పని చేస్తామని భారత ప్రభుత్వానికి వెల్లడించింది. ఎక్స్‌లో పోస్ట్ అవుతున్న అడల్ట్ కంటెంట్ (Adult Content) తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. పలువురు వ్యక్తులు ఫేక్ అకౌంట్లతో అశ్లీల, లైంగిక కంటెంట్ షేర్ చేయడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎక్స్ ఏఐ టూల్, గ్రోక్ ద్వారా సృష్టించబడ్డ కంటెంట్ కూడా ఉంటోంది.
ప్రస్తుతానికి పలు పరిశీలనల తర్వాత సుమారు 3,500 కంటెంట్ నిషేధించి. 600 కంటే ఎక్కువ ఖాతాలను తొలగించినట్లు ఎక్స్ ప్రకటించింది. భవిష్యత్తులో ఏ విధమైన అశ్లీల చిత్రం లేదా కంటెంట్ ఎక్స్ వేదికపైకి రాకుండా కట్టుదిట్టంగా నియంత్రిస్తామని వెల్లడించింది. భారతదేశ చట్టాలను గౌరవిస్తూ, వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. సోషల్ మీడియాను అందరూ సురక్షితంగా వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది.

Read Also: సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ శౌర్యయాత్ర
Follow Us On : WhatsApp


