Mobile Popup Ad
Mobile Popup Ad

వందే భార‌త్ ఫుడ్‌లో పురుగులు.. ఒకే కోచ్‌లో రెండు ఘ‌ట‌న‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) రైలులో ఫుడ్ క్వాలిటీపై ఎన్ని ఫిర్యాదులు, విమ‌ర్శ‌లు వ‌స్తున్నా తీరు మార‌డం లేదు. ఇటీవ‌ల పెరుగులో పురుగులు రావ‌డం, ఫుడ్‌తో ఒక యువ‌తికి స్కిన్ అలర్జీ కావ‌డం వంటి ఘ‌ట‌న‌లు మ‌రువ‌క‌ముందే మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. అహ్మదాబాద్ నుంచి ముంబై (Ahmedabad to Mumbai) వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్రయాణికులకు అందించిన ఫుడ్‌లో పురుగులు రావడం కలకలం రేపింది. ఒకే కోచ్‌లో ఇలాంటి ఘటనలు రెండుసార్లు జరగడంతో ప్రయాణికులు షాక‌య్యారు. ఫుడ్ తిన‌డం ఆపి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ క్వాలిటీ విషయంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న‌ బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థపై తక్షణమే తనిఖీలు నిర్వహించాలని, బాధ్యులైన వారి లైసెన్స్‌ను రద్దు చేయాలని ప్రయాణికులు, రైల్వే సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>