కలం, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంతువైన జోనాథన్ అనే పేరుగల తాబేలు (Tortoise Jonathan) చనిపోయింది. ఈ తాబేలు వయసు 193 సంవత్సరాల పైనే ఉంటుందని చెబుతున్నారు. బ్రిటీష్ ఓవర్సీస్ ప్రదేశమైన సెయింట్ హెలెనాలో ఈ తాబేలు కన్నుమూసిందని అధికారులు వెల్లడించారు. 1832లో ఈ తాబేలు పుట్టిందని.. 1882లో హిందూ మహాసముద్రం నుంచి సెయింట్ హెలెనాకి తరలించామని సెయింట్ హెలెనా పశువైద్యుడు జో హాలిన్స్ జొనాథన్ తెలిపారు. 1930లలో గవర్నర్ సర్ స్పెన్సర్ డేవిస్.. ఈ తాబేలుకు జోనాథన్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. ఈ తాబేలు గవర్నర్ అధికారిక నివాసం ‘ప్లాంటేషన్ హౌస్’లో నివసించేది తెలిపారు. 2026 ఏప్రిల్ 1న జోనాథన్ మరణించినట్లు ప్రకటించారు.
Read Also: ఆధార్‌తో సైబర్ మోసాలు.. భారీ ముఠా అరెస్ట్
Follow Us On: Instagram

