కలం, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Dharmapuri Road Accident) జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్‌ను ఢీకొట్టి, పక్కనే వెళ్తున్న ఆటోను అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో బోల్తా కొట్టడంతో పలువురు హనుమాన్ భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, మృతులను ధర్మపురి పట్టణ వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: FY 2025-26లో రూ.685 కోట్ల ఆస్తిపన్ను వసూలు
Follow Us On : WhatsApp

