కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని (World Food Safety Day) పురస్కరించుకొని కలెక్టరేట్ లో ఆహార భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం, FoSTaC శిక్షణా తరగతులను నిర్వహించారు. నిజామాబాబ్ జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి (FSO) నవిత పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 160 మంది ఫుడ్ హ్యాండ్లర్లు (ఆహార నిర్వాహకులు), అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆహారాన్ని తయారు చేసేటప్పుడు, పంపిణీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ప్రమాణాల గురించి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
Read Also: దేశాన్ని విభజించొద్దు.. రేవంత్‌కు కేంద్ర మంత్రి కౌంటర్
Follow Us On: Instagram

