మహిళా రిజర్వేషన్ బిల్లు అమ‌ల‌య్యేది అప్పుడే..!

క‌లం, వెబ్ డెస్క్‌: 2023లో పార్లమెంటు ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill)ను అవసరమైన సవరణలతో 2029 నాటికి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టం అమలు కోసం నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని సవరించనున్నారు. అయితే, ఈ పునర్విభజన ప్రక్రియకు 2011 జనాభా గణనను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు సమాచారం. ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలు కావడానికి రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి, పార్లమెంటులో 2/3 వంతుల‌ మెజారిటీ సాధించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలతో ఏకాభిప్రాయం కోసం చర్యలు తీసుకుంటోంది.

ఈ బిల్లు (Womens Reservation Bill) అమలులోకి వచ్చిన తర్వాత పార్లమెంటు స్వరూపం మారనుంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం లోక్‌సభలోని (Lok Sabha) మొత్తం స్థానాల సంఖ్య 816కు పెరుగుతుందని అంచనా. ఇందులో మహిళలకు కేటాయించిన 33 శాతం కోటా ప్రకారం 273 స్థానాలు మహిళా ప్రతినిధుల కోసం రిజర్వ్ చేయబడతాయి. ఇది భారత రాజకీయ ముఖచిత్రంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పటిష్టం చేస్తూ, నిర్ణయాధికారాల్లో వారికి కీలక పాత్రను కట్టబెట్టనుంది.

Read Also: BRSపై సీతక్క ఫైర్.. పదేళ్లు ఏం చేశారంటూ ఆగ్రహం

Follow Us On: Youtube

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>