కలం, సినిమా : కన్నడ స్టార్ యశ్ (Yash) నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “టాక్సిక్” ట్రైలర్ (Toxic Trailer) రిలీజ్ అయింది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలైన ‘టాక్సిక్’ ట్రైలర్ ప్రేక్షకులను ఓ సరికొత్త స్టైలిష్ యాక్షన్ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. హీరో యశ్ తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ట్రైలర్ మొత్తాన్ని డామినేట్ చేశాడు. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, యశ్ లుక్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
ఇప్పటివరకు ‘టాక్సిక్’ అంటే బోల్డ్ కంటెంట్‌తో కూడిన సినిమా అనే అభిప్రాయం ఉండగా.. తాజాగా విడుదలైన ట్రైలర్లో పూర్తిగా కంటెంట్‌ని నింపేశారు. ముఖ్యంగా యశ్ డ్యూయల్ లుక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రెండు విభిన్న గెటప్స్‌లో యశ్ కనిపిస్తూ తన స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టాడు. పవర్ఫుల్ డైలాగ్స్, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, గ్రాండ్ విజువల్స్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా భారీ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆగస్టు 26, 2026న ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

