కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth) రెడ్డి రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు (insurance cheques) అందజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓర్సు సురేశ్, ముక్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున చెక్కులు అందించారు. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. సీఎం మాట్లాడుతూ.. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ (Rajiv Aarogyasri) పరిమితిని రూ. 5 లక్షల నుంచి పది లక్షలకు పెంచాం.
సీపెక్ సర్వే ప్రకారం తేలిన కుటుంబాలన్నింటికీ రూ. 5 లక్షల బీమా వర్తిస్తుంది. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడొద్దని భావనతో కుటుంబ బీమా తీసుకొచ్చాం. విద్యుత్, సింగరేణి కార్మికులకు రూ. కోటి పైన ప్రమాద బీమా సౌకర్యం కల్పించాం. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాం’ అని సీఎం రేవంత్ (CM Revanth) వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.
Read Also: BRSపై సీతక్క ఫైర్.. పదేళ్లు ఏం చేశారంటూ ఆగ్రహం
Follow Us On : WhatsApp

