ఆశ వర్కర్లకు శ్రమకు తగ్గ‌ వేతనం ఇవ్వాలి: గణేష్ బిగాల

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్‌లో (Nizamabad) బీఆర్టీయూ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ వర్కర్ల సమ్మెకు నిజామాబాద్ అర్బన్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల (Ganesh Bigala) మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆశ వర్కర్లు చేస్తున్న న్యాయమైన సమ్మెకు పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆశ వర్కర్ల జీతాలను రూ.18,000కు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలో ఉన్న సమయంలో ఆశ వర్కర్ల జీతాలను రూ.2,200 నుంచి రూ.9,750 వరకు పెంచారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పూర్తిగా విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను (Ganesh Bigala) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి మహిళా దినోత్సవం సందర్భంగా ఆశ వర్కర్లకు చీరలు, భోజనాలతో గౌరవంగా సన్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆశ వర్కర్లను పట్టించుకునే పరిస్థితి లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఆశ వర్కర్లను (Asha Workers) సర్వేలు, ఇతర కార్యక్రమాలకు వినియోగించుకుంటూ, వారి శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు.. ఆశ వర్కర్ల జీతాలను తక్షణమే రూ.18,000కు పెంచాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పారు. ఆశ వర్కర్లు పిలుపునిచ్చే ప్రతి ఆందోళనలో పాల్గొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Read Also: AI సాయంతో 26 కిలోల బరువు తగ్గిన వ్యక్తి.. ఎలా అంటే..?

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>