కలం, వెబ్ డెస్క్ : మంగళగిరి ఎయిమ్స్ (AIIMS Mangalagiri) ఆస్పత్రిలో దారుణం జరిగింది. సెక్యూరిటీ సూపర్ వైజర్ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళను సెక్యూరిటీ సూపర్ వైజర్ మోహనచారి ఏడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తాను చెప్పినట్టు వినాలని లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరిస్తున్నాడు. తనను వేధించొద్దని.. వదిలేయాలని ఆ మహిళ ఎన్ని సార్లు కోరినా వినిపించుకోలేదు. ఈ మధ్య వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. సదరు మహిళ భర్త చనిపోవడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: టీటీడీలో లోపాలు.. బీఆర్ నాయుడిపై యాంకర్ శ్యామల ఫైర్
Follow Us On : WhatsApp

