కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వంలో టీటీడీలో అపచారాలు పెరిగాయని యాంకర్ శ్యామల (Anchor Shyamala) మండిపడ్డారు. శనివారం ఆమె వైసీపీ మహిళ నేతలతో కలిసి మాట్లాడారు. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు (BR Naidu) వచ్చినప్పటి నుంచి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘గోవులు చనిపోతున్నాయి. మద్యం దొరుకుతోంది. తొక్కిసలాటలో భక్తులు చనిపోతున్నారు’ అని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు నీళ్లు కూడా ఇవ్వడం లేదని, లడ్డూ, భద్రత విషయాల్లో అబద్ధాలు చెబుతున్నారని శ్యామల పేర్కొన్నారు.
తిరుమల రక్షణ కోసం వైసీపీ మహిళ నేతలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే.. పోలీసులు దారుణంగా వ్యవహరించారన్నారు. మహిళలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం చట్టవిరుద్ధమని తెలియదా? అని శ్యామల ప్రశ్నించారు. తిరుమల కొండపై జరుగుతున్న అనైతిక కార్యక్రమాకు బాధ్యత వహించి, బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పతనం కాకతప్పదని, కచ్చితంగా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతామని శ్యామల (Anchor Shyamala) హెచ్చరించారు.
Read Also: ఒకే పంట కాకుండా ఎక్కువ పంటలు వేయాలి: కేంద్రమంత్రి పెమ్మసాని
Follow Us On: Instagram

