అకాల వర్షాలు.. పాల్వంచలో 265 ఎకరాల పంట నష్టం

కలం, వెబ్ డెస్క్ : శుక్రవారం కురిసిన అకాల వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సుమారు 265 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వడగళ్ల వాన కారణంగా జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాల్వంచ (Palvancha) మండలం పాయకారి యానం బైలు , రాజాపురం గ్రామాల్లో మక్కజొన్న పంటను సందర్శించి నష్టం స్థాయిని అంచనా వేశారు. ప్రాథమికంగా 7 గ్రామాల్లో 190 మంది రైతులకు చెందిన సుమారు 265 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు. కాగా శనివారం లక్ష్మీదేవిపల్లి మండలంలో కురిసిన వడగండ్ల వాన కారణంగా మొక్క జొన్న పంట నీటి పాలవ్వడం గమనార్హం.

Read Also: టీటీడీలో లోపాలు.. బీఆర్ నాయుడిపై యాంకర్ శ్యామల ఫైర్

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>