కలం, వెబ్‌డెస్క్: నేటి కాలంలో విజ్ఞాన రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా దూసుకుపోతున్నప్పటికీ, అమ్మాయిలకు కనీస రక్షణ కరువైందనేది కాదనలేని నిజం. రాత్రి వేళల్లోనే కాకుండా, పగటిపూట కూడా ఒంటరిగా బయటకు వెళ్లాలంటే మహిళలు భయపడాల్సిన పరిస్థితులు నేడు నెలకొన్నాయి. నిత్యం దేశ వ్యాప్తంగా ఏదో ఒక చోట అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరగడం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. బయటకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు కుటుంబ సభ్యులు టెన్షన్ పడే కాలం వచ్చింది. అయితే నిత్యం ఇలా భయపడుతూ కూర్చుంటే ఏ పనీ చేయలేం. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమ్మాయిలు తమను తాము రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం బయటకు వెళ్లినప్పుడు ప్రతి అమ్మాయి తన బ్యాగ్‌లో భద్రత కోసం (Safety Tips) ఈ 3 వస్తువులను తప్పకుండా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
ఈ కాలంలో మహిళలు చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రయాణం, రాత్రి షిఫ్టులు వంటి అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు బయటికి వెళ్తుంటారు. అయితే వీటన్నిటితో పాటు, వారి భద్రత కూడా ప్రశ్నార్ధకంగా మారుతుంది. మారుతున్న ఈ కాలంలో మహిళలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అందుకే చాలామంది మహిళలు తమ భద్రత కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను (Safety Tips) ఎల్లప్పుడూ తమ పర్సులలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందామా?
మహిళలు తమ పర్సులో ఉంచుకోవాల్సిన వస్తువులు
ఫోల్డింగ్ కత్తి లేదా బహుళ ప్రయోజన భద్రతా సాధనం
మహిళలు తమ భద్రత కోసం తమ పర్సులో ఒక చిన్న ఫోల్డింగ్ కత్తి లేదా బహుళ ప్రయోజనాల వాహనం ఉంచుకోవాలని చెబుతున్నారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
పెప్పర్ స్ప్రే
మహిళలు ఎక్కువగా ఉపయోగించే భద్రతా స్ప్రేలలో పెప్పర్ స్ప్రే ఒకటి. మీరు కూడా దీనిని మీ పర్సులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇది ఉపయోగించడానికి సులభమైన, తేలికైన, ప్రభావవంతమైన ఎంపిక. ఒకవేళ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తి మిమ్మల్ని అనుసరిస్తున్నా, ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తినా, పెప్పర్ స్ప్రేను ఉపయోగించడం వల్ల అవతలి వ్యక్తి కొంతసేపు అసౌకర్యానికి గురయ్యేలా ఈ స్ప్రే చేస్తుందట. దీంతో
భద్రతా అలారం
అమ్మాయిలు తమతోపాటు ఒక చిన్న భద్రతా అలారం లేదా వ్యక్తిగత అలారంను వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ పరికరం యాక్టివేట్ అయినప్పుడు, అది పెద్ద శబ్దాన్ని చేస్తుంది. ఈ ఆకస్మిక శబ్దం చుట్టుపక్కల వారి దృష్టిని ఆకర్షించి, సహాయం పొందే అవకాశాలను పెంచుతుంది. ముఖ్యంగా అర్ధరాత్రి ప్రయాణించేటప్పుడు లేదా ఏకాంత ప్రదేశాలలో ఉన్నప్పుడు ఈ అలారం చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.
Read Also: ఇంటి మెట్లపై కూర్చుంటున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?
Follow Us On: WhatsApp

