Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఆటే నా పొగరు’ .. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్

కలం, సినిమా డెస్క్: రామ్ చరణ్ తేజ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్ (Peddi Trailer) సోమవారం రిలీజ్ అయింది. ‘ఆటే నా పొగరు’ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ ను ఈలలు వేయిస్తున్నాయి. మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నది. ‘ఉప్పెన’ సినిమాతో తన టాలెంట్ నిరూపించుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

‘‘ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవర్ ప్లే మారుతుంది కానీ.. ఫేవర్ ప్లేయర్ మారటం లేదు. పెద్ది.. ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా?” బోమన్ ఇరానీ డైలాగ్ చెప్పడంతో.. వరుసగా కొందరు ఆటగాళ్లు ముందుకు వచ్చి.. ‘‘నా పేవరేట్ క్రికెటర్ పెద్ది సార్.. నా ఫేవరెట్ రెజిలర్ పెద్ది సార్.. నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్” అని చెప్తుంటారు. పెద్ది పాత్రలో రామ్ చరణ్ తేజ్.. క్రికెటర్‌గా, రెజిలర్‌గా, రన్నర్‌గా ఈ మూవీలో నటించాడు. ‘ఆటే నా పొగరు..’ అంటూ క్రికెట్‌లో, రెజ్లింగ్‌లో, రన్నింగ్‌లో చరణ్ దుమ్మురేపుతాడు. ఆయనకు జోడీగా నటించిన జాన్వీ కపూర్ చెప్పే డైలాగ్స్ ఊర మాస్లా ఉంటాయి.

‘‘ఆకాశం నుంచి సుక్కలు రాలిపడతాయంటారు కదా.. ఓ సుక్కేమైనా ఈ పూట విజయనగరంలో రాలిపడినాదేటిరా” అంటూ చరణ్ డైలాగ్ చెప్తుండగా జాన్వీ ఇంట్రడ్యూస్ అవుతుంది. తన వెంట ఉన్న యూత్‌ను పట్టుకొని.. ‘‘బొక్కలోని కబుర్లు చెప్పకు నాకు” అంటూ జాన్వీ వార్నింగ్లు ఇస్తుంది. కాగా, ఓ ఊరు, ఆ ఊరిలో జరిగిన ఓ అనుకోని సంఘటన, దాని నుంచి ఊరిని కాపాడుకోవటానికి ఆటల్లో పెద్ది ఆరితేరడం చుట్టూ ట్రైలర్ (Peddi Trailer) నడుస్తుంది. ‘‘మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు..” అంటూ పెద్ది చెప్పే ఎమోషనల్ డైలాగ్ కూడా చివర్లో ఉంటుంది. చిత్ర ప్రచారంలో భాగంగా ట్రైలర్‌ను ముంబైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో పాటు సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమన్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.

Read Also: సుడిగాలి సుధీర్ కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>