Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంటి మెట్లపై కూర్చుంటున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?

కలం, వెబ్ ‌డెస్క్: జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా, బలంగా నమ్ముతారు. కేవలం ఇల్లు కట్టుకునేటప్పుడే కాకుండా, వ్యాపార సంస్థలు, ఆఫీసులు, దేవాలయాల నిర్మాణంలో కూడా హిందువులు వాస్తు నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. అయితే వాస్త్రు శాస్త్ర ప్రకారం ఇంటిలోని మెట్లపై కూర్చోవడం మంచిదేనా? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు (Vastu Tips) ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం చాలా మందిని చూస్తుంటాం.. సాయంత్రం అవ్వగానే లేదా ఖాళీ సమయం దొరికితే చాలు, ప్రశాంతంగా ఉంటుందని ఇంటి ముందరి మెట్లపైనో లేదా సింహద్వారం గుమ్మం పైనో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కొందరైతే అక్కడ కూర్చోవడాన్ని ఒక అలవాటుగా మార్చేసుకుంటారు. కానీ చిన్న తప్పు వల్ల చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవేమిటో మనం తెలుసుకుందాం.

పదే పదే ఇంటి మెట్లపై కూర్చోవడం వలన ఇది సానుకూల శక్తిని అడ్డుకుంటుందట. దీని వలన ఇంటిలో ప్రతి కూల శక్తి పెరిగి, ఒత్తిడి, ఆందోళన పెరగడం, ఇంటిలో గొడవలు జరగడం వంటి ఇబ్బందికర వాతావరణం నెలకొంటుందంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా ఇంటి మెట్లపై కూర్చోకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.

అంతే కాకుండా ఇలా పదే పదే మెట్లపై కూర్చోవడం అనేది సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంట. ఇంటి వాతావరణం, శక్తి కుటుంబంలో బంధాల్లో సమస్యలను తీసుకొస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఇంటిలో ఒత్తిడి, కలహాలు వంటి సమస్యలకు కారణం అవుతుంది. అంతే కాకుండా ఎప్పుడో ఏదో ఒక గొడవల, అనారోగ్య సమస్యలు, ఇళ్లు బరువుగా అనిపించడం మనశ్శాంతి లోపించడం వంటి సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>