Mobile Popup Ad
Mobile Popup Ad

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్యలను పరిష్కరించాలి: కేపీ వివేకానంద

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) డిమాండ్ చేశారు. మేడ్చల్ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ మను చౌదరి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన హాజరయ్యారు.ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్, నిజాంపేట్, బాచుపల్లి, కైసర్ నగర్ తో పాటు అన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో సీలింగ్, రూఫ్ లీకేజీల కారణంగా నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని అన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆయా ఇళ్ల సముదాయాల్లో నివసిస్తున్న ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రార్థనా మందిరాలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని సూచించారు.

అలాగే ప్రజల అవసరాల మేరకు వైకుంఠ ధామాల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. పేద ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. చెత్త సకాలంలో తొలగింపు, కాలనీల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>