కలం, వెబ్ డెస్క్: అరుణాచల్ ప్రదేశ్‌లోని (Arunachal Pradesh) అంజావ్ జిల్లాలో మహిళలు నిత్యం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రాకపోకల కోసం సరైన వంతెన లేకపోవడంతో ఉక్కు తీగను పట్టుకుని నదిని దాటుతున్నారు. దేశం వేగవంతమైన అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని చెప్పుకుంటున్నా.. ఆ ప్రాంతంలో ఇప్పటికీ వంతెన లేకపోవడం వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. అత్యవసర అవసరాలు, ఉపాధి, విద్య, వైద్య సేవల కోసం నదిని దాటే ప్రతి సందర్భంలో వారి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ పరిస్థితిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శాశ్వత వంతెన నిర్మించి ప్రజల కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నది దాటాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే!
-అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజావ్లో బ్రిడ్జి లేక మహిళల సాహసాలు!
-ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని.. స్టీలు వైరుపై నది దాటుతున్న మహిళలు!
-నెట్టింట వైరల్ అవుతున్న మహిళల నది దాటే దృశ్యాలు!
Women Risk Lives Crossing River on Wire Rope in… pic.twitter.com/ZMCaWngE5K— Kalam Daily (@kalamtelugu) July 19, 2026
Read Also: అమ్మాయిల్లో పెరుగుతున్న స్మోకింగ్ హ్యాబిట్.. హెల్త్‌కి రిస్క్!
Follow Us On : WhatsApp

