అమ్మాయిల్లో పెరుగుతున్న స్మోకింగ్ హ్యాబిట్.. హెల్త్‌కి రిస్క్!

కలం, వెబ్ డెస్క్: సినిమాల ప్రభావమో.. స్టైల్ కోసమే కానీ అమ్మాయిల్లో స్మోకింగ్ హ్యాబిట్ (Smoking Habit) రోజురోజుకూ పెరిగిపోతోంది. దేశంలో పొగాకు వినియోగం కొంతమేర తగ్గుముఖం పడుతున్నప్పటికీ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు స్మోకింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ బాలికల్లో సిగరెట్ తాగే అలవాటు ఆందోళనకరంగా ఉంది. ఈ విషయమై గతంలో ఎన్నోసార్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించిన సందర్భాలున్నాయి. 2019 నుంచి 2025 మధ్య బాలికల్లో ధూమపానం చేసే వారి శాతం 6 శాతం నుంచి 12 శాతంగా పెరిగినట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

స్టైల్ కోసం స్మోకింగ్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. 10 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారిని కౌమారదశలో ఉన్నవారిగా పరిగణిస్తారు. ఈ వయస్సులో బాలికలు శారీరక, మానసిక మార్పులను ఎదుర్కొంటారు. స్నేహితుల ప్రభావం, ఒత్తిడి, ఆధునికంగా కనిపించాలనే కోరిక లాంటి కారణాలతో సిగరెట్ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పింది. ముఖ్యంగా గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో బాలికలు, అబ్బాయిలతో సమానంగా ధూమపానం ((Smoking Habit) చేస్తున్నారట. అంతేకాకుండా పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ధూమపానం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. సినిమాలు, సోషల్ మీడియా వంటి వేదికల్లో సిగరెట్‌ను స్వేచ్ఛ, ఆధునికత, స్టైల్‌కు ప్రతీకగా చూపించడం కూడా యువతను ప్రభావితం చేస్తోంది. బాలికల్లో పెరుగుతున్న ఈ ధూమపాన అలవాటు భవిష్యత్తులో అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

హైదరాబాద్ అమ్మాయిల్లో..

హైదరాబాద్ నగరంలో యువతలో ధూమపానం ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పలు పబ్‌లు, కేఫేలు, రెస్టారెంట్లలో యువతులు యువకులతో సమానంగా సిగరెట్లు తాగుతూ కనిపిస్తున్న దృశ్యాలు సాధారణమవుతున్నాయి. అంతేకాకుండా.. రోడ్లపై కూడా స్టైల్‌గా సిగరెట్ కాలుస్తూ తిరిగే వారి సంఖ్య పెరుగుతోంది. మొదట ఫ్యాషన్, స్నేహితుల ప్రభావంతో ప్రారంభమైన ఈ అలవాటు, క్రమంగా వ్యసనంగా మారి అనారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హెల్త్‌కి రిస్క్

  • ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
  • గుండె జబ్బులు, గుండెపోటు ఎక్కువవుతుంది.
  • శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.
  • రోగనిరోధక శక్తి తగ్గి తరచుగా ఇన్ఫెక్షన్లు బాధిస్తాయి
  • చర్మం త్వరగా ముడతలు పడటం, వృద్ధాప్య లక్షణాల బారిన పడటం
  • నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధులు రావచ్చు.
  • సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంటుంది.

Read Also: ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్.. అప్లై చేశారా!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>