ఏపీలో కరోనా కల్లోలం.. మరో వ్యక్తికి పాజిటివ్ !

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు (AP Covid Cases) నమోదు అవుతుండడం ప్రజల్లో ఆందోళనను కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదయ్యింది. 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వైద్య సిబ్బంది అప్రమత్తం అయ్యారు. అతనికి రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.

ఇదిలాఉంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండడం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు కరోనా నుంచి కోలుకోగా.. నలుగురు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. అలాగే ఐదుగురు బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ మహమ్మారితో నలుగురు మృతి చెందారు.

Read Also: భూ వివాదంలో చిక్కుకున్న తమ్మినేని.. కేసు నమోదు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>