పొరపాటున అకౌంట్లోకి రూ. 10 కోట్లు జమ.. మహిళ ఏం చేసిందంటే?

కలం, వెబ్ డెస్క్ : రోడ్డుపై వెళ్లుండగా  ఒక్క రూపాయి కనిపిస్తేనే ఎవరూ చూడకపోతే చటుక్కున తీసి జేబులో వేసుకుని తమకేమీ తెలియదన్నట్లుగా వెళ్లే ప్రస్తుత సమాజంలో ఓ మహిళ చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. వందలు, వేలు, లక్షలు కాదు ఏకంగా తన బ్యాంకు ఖాతాలో పొరపాటున దాదాపు రూ. 10 కోట్లు పడినా.. ఏ మాత్రం డబ్బుకు ఆశపడని సదరు మహిళ చూపించిన నిజాయితీకి పలువురు సోషల్ మీడియా వేదికగా సలాం చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral News) గా మారింది.

వివరాల్లోకి వెళ్తే .. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం మైన్‌పురి జిల్లాకు చెందిన రీటా (Rita) అనే మహిళా రైతు బ్యాంక్ ఖాతాలో పొరపాటున దాదాపు రూ. 10 కోట్లు జమ అయ్యాయి. బ్యాలెన్స్ చెక్ చేసేందుకు కొడుకుతో కలిసి సమీపంలోని ఏటీఎంకు వెళ్లిన మహిళకు ఈ విషయం తెలిసింది. తన ఖాతాలో రూ.9,99,49,588 ఉన్నట్లు చూసి షాక్ అయింది. అనుమానంతో మరో ఏటీఎంలో చెక్ చేయగా, అదే మొత్తం కనిపించింది. వెంటనే తన కుటుంబ సభ్యులను హెచ్చరించిన ఆమె, “ఈ డబ్బు మనది కాదు, ఒక్క రూపాయి కూడా తాకొద్దు” అని స్పష్టం చేశారు.

అనంతరం వెంటనే బ్యాంకు అధికారులకు ఆమె సమాచారం ఇచ్చారు. ఈ లావాదేవీ గురించి తనకు ఏమీ తెలియదని ఆ మహిళ చెప్పింది. “ఈ డబ్బు ఎలా వచ్చిందో తెలియదు. ఇది ఎవరిదైనా సరే, దాన్ని తిరిగి ఇచ్చేయాలి” అని అనుకుంటున్నట్లు తెలిపింది. ఆమె భర్త అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కరీంగంజ్ బ్రాంచ్ మేనేజర్ రిషికాంత్ పాండే, ఇది సాంకేతిక లోపం వల్లే జరిగిందని.. దాన్ని సరిదిద్దుతామని తెలిపారు. రీటా నిజాయతీ గురించి తెలియగానే గ్రామస్థులు, చుట్టుపక్కల వారు ఆమెను అభినందించారు. ఆమె ఏటీఎంలో రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఆమె నిజాయితీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి నిస్వార్థపరులు ఉండటం నిజంగా అరుదని కొనియాడుతున్నారు.

Read Also: సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>