Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన విజ‌య్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: త‌మిళ‌నాడు (Tamil Nadu Elections) ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. హీరో విజ‌య్ (Vijay) పొలిటిక‌ల్ ఎంట్రీతో అంద‌రి దృష్టి ఆయ‌న మీదే ఉంది. విజ‌య్ పార్టీ టీవీకే (TVK) త‌మిళ‌నాట ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందోన‌న్నదానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. నేడు విజ‌య్ 234 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. టీవీకే అభ్య‌ర్థుల్లో మెజార్టీ స‌భ్యులు సామాన్యులే ఉండ‌టం విశేషం. అందులోనూ విజ‌య్ త‌న వ్య‌క్తిగ‌త డ్రైవ‌ర్ కుమారుడికి అసెంబ్లీ సీటు కేటాయించ‌డంపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. విజ‌య్ వ్య‌క్తిగ‌త డ్రైవ‌ర్ రాజేంద్ర‌న్ కుమారుడు శ‌బ్రినాథ‌న్‌కు అసెంబ్లీ సీట్ ప్ర‌క‌టించారు.

శ‌బ్రినాథ‌న్ విరుగంబాక్కం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌బ్రినాథ‌న్ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. రాజేంద్ర‌న్‌, శ‌బ్రినాథ‌న్ విజ‌య్‌కి (TVK Vijay) థ్యాంక్స్ చెప్తూ క‌న్నీళ్లు పెట్టుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విజయ్ గొప్ప మనసు ఉన్న వాడంటూ ఫ్యాన్స్ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇక విజ‌య్‌ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పెరంబ‌దూర్‌, తిరుచ్చి నియోజ‌క‌వ‌ర్గాల నుంచి విజ‌య్ పోటీ బ‌రిలో నిలువ‌నున్నారు.

Read Also: తల్లిదండ్రుల రక్షణ కోసమే వయోవృద్ధుల కమిషన్ : సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>