సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ఆదివారం మేనకా గాంధీ (Maneka Gandhi) బృందం భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Ramakrishna Rao), ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్స్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలను మేనక గాంధీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరించారు. మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా అధికారులు వివరించారు.

రాష్ట్రంలో గోసంరక్షణకు తమ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిందని మేనకా గాంధీకి (Maneka Gandhi) సీఎం తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో విశాల ప్రదేశంలో ఎన్కేపల్లిలో (NK Palli) గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్ధాపన చేసినట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. జంతు సంరక్షణ విషయంలో ప్రభుత్వ చర్యలపై మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రశంసించారు.

Read Also: పొరపాటున అకౌంట్లోకి రూ. 10 కోట్లు జమ.. మహిళ ఏం చేసిందంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>