కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మెయిన్‌పురి జిల్లాలో హృదయవిదారకమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాశీరామ్ కాలనీలో నివసించే సంగీత అనే మహిళకు, అంకుల్‌తో సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహమైంది. నలుగురు కుమారులు, ఒక కుమార్తె. అంకుల్ ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తూ ఇంటికి దూరంగా ఉండటం వల్ల సంగీత ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఈ సమయంలో ఆమె కాన్పూర్‌కు చెందిన ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది, అది క్రమంగా ప్రేమగా మారింది. భర్త ఇంట్లో లేని సమయాన్ని అదనుగా తీసుకుని, సంగీత తన ప్రియుడితో కలిసి పారిపోయింది.
ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను, అలాగే భర్త పేరుపై తీసుకున్న రుణం నుంచి సుమారు రూ.70వేల నగదును తీసుకుని వెళ్లిపోయింది. అంకుల్ ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య లేకపోవడం, పిల్లలు ఒంటరిగా ఉండటం చూసి షాక్ అయ్యాడు. పిల్లలు తల్లి లేకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో – పిల్లలు ఏడుస్తూ తల్లి కోసం వేచి ఉండటం – సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంకుల్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పిల్లల భవిష్యత్తు, భద్రత కోసం న్యాయం చేయాలని అధికారులను కోరాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
Read Also: హైదరాబాద్ పబ్బుల్లో ఈగల్ టీమ్ తనిఖీలు..
Follow Us On: Youtube


