epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

క్లీన్ సిటీ కోసం ‘మెగా డ్రైవ్’.. రేపటి నుంచే ప్రారంభం

కలం, వెబ్ డెస్క్​ : స్వచ్ఛ హైదరాబాద్​ లక్ష్యంగా గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మెగా శానిటేషన్​ డ్రైవ్ (Mega Sanitation Drive) చేపట్టనుంది. నగర వ్యాప్తంగా 300 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి జనవరి చివరి వరకు నిర్వహించనున్నారు. పరిశుభ్రమైన, పచ్చని నగరం దిశగా డిసెంబర్ 29 నుంచి జనవరి 31 వరకు నగరంలోని 300 వార్డులను కవర్​ చేస్తూ జీహెచ్​ఎంసీ అతిపెద్ద శానిటేషన్​ డ్రైవ్ ను ప్రారంభించనుంది. వ్యర్థాలు, చెత్తా, చెదారం తొలగింపు, ఫుట్​ ఓవర్ బ్రిడ్జీలు, ఫ్లైఓవర్లు, రోడ్లు, డివైడర్లు, మీడియన్లను క్లీన్​ చేయనున్నారు. సరస్సులు, నాలాలు, పార్కులు, ఫుట్​ పాత్ లను కూడా శుభ్రం చేస్తారు. సీ అండ్ డీ వ్యర్థాల తొలగింపు, గ్రీన్​ వేస్ట్​ మేనేజ్ మెంట్, జీవీపీలను అందమైన సెల్ఫీ పాయింట్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన జీహెచ్​ఎంసీ.

అలాగే, శానిటేషన్​ డ్రైవ్​ లో భాగంగా నగర ప్రజలకు స్వచ్ఛతపై అవకాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. స్కూళ్లలో చిన్నారులు, యూత్​ చేత ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ–వేస్ట్(E Waste)​, పునర్వినియోగ వస్తువులను సేకరించనున్నారు. దీంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, మూత్ర విసర్జన, చెత్తను డంపింగ్ చేస్తే భారీ జరిమానాలను విధించనున్న జీహెచ్ఎంసీ. క్లెయిమ్​ చేయని స్క్రాప్​ వాహనాలు తొలగిస్తారు. శిథిలావస్థలో ఉన్న పబ్లిక్ టాయిలెట్లను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

మెగా శానిటేషన్​ డ్రైవ్ లో భాగంగా రోజువారీగా వార్డు ల ప్రకారం నివేదికలు రూపొందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, సిటీలో ప్రతి రోజూ దాదాపు 7 వేల టన్నుల చెత్త పేరుకుపోతున్నది. దాదాపు 22 వేల మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. నాలుగున్నర వేల స్వచ్ఛ ఆటోలు సిటీ రోడ్లపై చేత్తను సేకరిస్తున్నాయి. అయితే, జీహెచ్​ఎంసీ పాలకవర్గ పదవీ కాలం ఫిబ్రవరితో ముగియనున్నది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ ఆ 300 వార్డుల్లో మెగా శానిటేషన్ డ్రైవ్​ చేపట్టింది.

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, మూత్ర విసర్జన, అక్రమ డంపింగ్ చేసే వారికి జరిమానాలు విధించనున్నారు. క్లెయిమ్ చేయని స్క్రాప్ వాహనాల తొలగిస్తారు. శిథిలావస్థలో ఉన్న పబ్లిక్ టాయిలెట్ల పునరుద్ధరించనున్నారు. డ్రైవ్​ సందర్భంగా రోజువారీ వార్డు వారీగా నివేదికలు రూపొందించాలని అధికారులు ఆదేశించారు. జీహెచ్​ఎంసీ పాలకవర్గ పదవీ కాలం ఫిబ్రవరిలో ముగియనుంది. దీంతో త్వరలో అక్కడ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో GHMC శానిటేషన్​ డ్రైవ్​ చేపట్టినట్లు తెలుస్తోంది.

Read Also: హైదరాబాద్ పబ్బుల్లో ఈగల్ టీమ్ తనిఖీలు..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>