కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ (Narayankhed) పట్టణ శివారులోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. నిజాంపేట్–బీదర్ 161బీ నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు గుంతలో బైక్ పడిపోవడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఔటి నర్సింలు (27), జిన్న మల్లేష్ (24), జిన్న మహేష్ (23)లు నారాయణఖేడ్ నుంచి తమ స్వగ్రామమైన నర్సాపూర్‌కు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సమయంలో రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతను గమనించక బైక్ అదుపు తప్పి అందులో పడినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణ కేడ్ (Narayankhed) ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నర్సాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Read Also: ముఖానికి ముసుగు.. తాళ్లతో కట్టేసిన చేతులతో గ్యాంగ్‌స్టర్ నామినేషన్
Follow Us On: Sharechat


