Mobile Popup Ad
Mobile Popup Ad

కాలువ‌లోకి కారు దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో మ‌హిళ మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: నల్గొండ (Nalgonda) జిల్లా ముకుందాపురంలో శ‌నివారం రాత్రి నాగార్జున‌ సాగర్ కాలువలోకి (Nagarjuna Sagar Canal) కారు దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో భార్య‌భ‌ర్త‌లు తల్లాం పుల్లయ్య, పద్మ గ‌ల్లంతైన సంగ‌తి తెలిసిందే. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాలువ‌లో దంప‌తుల ఆచూకీ కోసం ముమ్మ‌రంగా గాలించారు. ఈ క్ర‌మంలో ఆదివారం మ‌ధ్యాహ్నానికి కారును గుర్తించారు. అయితే కారులో ప‌ద్మ మృత‌దేహం మాత్ర‌మే ఉంది. పుల్ల‌య్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ‌ర‌ద ఉధృతికి కొట్టుకొని పోయి ఉండ‌వ‌చ్చ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కారు డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంగా త‌ప్పించుకున్నాడు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని, డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read Also: ముస్లిం రిజర్వేషన్లపై రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>