కలం, వెబ్ డెస్క్ : మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) వేళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో మతపరమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
ఈ చర్య రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను అవమానించడమేనని రామచందర్ రావు (Ramchander Rao) పేర్కొన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అంబేద్కర్ గట్టిగా వ్యతిరేకించారని, ఇటువంటి విభజన ఎజెండాల పట్ల ఆయన ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని ఆయన అన్నారు.
ఎవరినీ ప్రత్యేకంగా సంతృప్తి పరచడం కాకుండా, అందరికీ న్యాయం చేయడమే బీజేపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి బీజేపీ మాత్రమే రక్షిస్తుందని, రాజ్యాంగ విలువల పరిరక్షణలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని రామచందర్ రావు పేర్కొన్నారు.
Read Also: కాంగ్రెస్ కు ఓటేస్తే పన్నులు పెంచుతారు : బండి సంజయ్
Follow Us On: Instagram


