epaper
Wednesday, February 18, 2026
epaper

అగ్ని ప్ర‌మాదంలో ఫోన్ ట్యాపింగ్ మెటీరియ‌ల్స్ ద‌గ్ధం: శిఖా గోయ‌ల్

క‌లం, వెబ్ డెస్క్‌: నాంప‌ల్లిలోని (Nampally) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో (Forensic Science Lab) జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో ఫోన్ ట్యాపింగ్‌ (Phone Tapping)కు సంబంధించిన కీల‌క ఆధారాలు ద‌గ్ధ‌మైన‌ట్లు డైరెక్ట‌ర్‌ శిఖా గోయ‌ల్ (Shikha Goel) ప్ర‌క‌టించారు. శ‌నివారం ఉద‌యం ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో తీవ్ర చ‌ర్చ మొద‌లైంది. రాష్ట్రంలో ప్ర‌ధాన కేసుల‌కు సంబంధించిన ఫైళ్లు ఆఫీసులో ఉన్నాయ‌ని, అవి ద‌గ్ధ‌మ‌య్యాయ‌ని చ‌ర్చ న‌డిచింది. నేడు ఉద‌యం ల్యాబ్‌ను ప‌రిశీలించిన అనంత‌రం సోష‌ల్ మీడియా పుకార్ల‌పై శిఖా గోయ‌ల్ స్ప‌ష్ట‌త‌నిచ్చారు. సోష‌ల్‌ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని చెప్పారు.

అయితే ఫోన్ ట్యాపింగ్‌కు (Phone Tapping) సంబంధించి 7 మెటీరియ‌ల్స్ ప్ర‌మాదంలో ద‌గ్ధ‌మ‌య్యాయ‌ని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ల్యాబ్‌కు గ‌తంలో 136 మెటీరియ‌ల్స్ వ‌చ్చాయ‌న్నారు. వీటిలో 7 మాత్ర‌మే ద‌గ్ధ‌మ‌య్యాయ‌ని తెలిపారు. అలాగే 2015 ఏసీబీ కేసు(ఓటుకు నోటు కేసు)కు సంబంధించి ల్యాబ్‌లో ఎలాంటి ఆధారాలు లేవ‌ని వెల్ల‌డించారు. వీట‌న్నింటిని 2021లోనే కోర్టులో స‌మ‌ర్పించిన‌ట్లు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇంకా ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

Read Also: ఫైర్ యాక్సిడెంట్‌పై బీఆర్ఎస్ విష ప్రచారం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>