epaper
Wednesday, February 18, 2026
epaper

ఆ నిధులు కేంద్రానివే, రేవంత్‌వి కావు: హరీష్ రావు

కలం, మెదక్ బ్యూరో : మున్సిపాలిటీలకు వచ్చే నిధులు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి జనాభా ప్రాతిపదికన నేరుగా వస్తాయని, అవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేబులో నుంచి ఇచ్చేవి కావని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. ఓటేస్తేనే అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అయితే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా వస్తాయని, అవి ప్రజల హక్కు అని ఆయన పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో బిఆర్ఎస్ అభ్యర్థుల తరపున హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. రెండేళ్ల తర్వాత మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు సదాశివపేటకు స్పెషల్ ప్యాకేజీ తెచ్చి, పట్టణాన్ని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత తనది మరియు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ది అని హామీ ఇచ్చారు. సదాశివపేట అభివృద్ధి ఆగకూడదన్నా, పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా.. కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

Read Also: కాలువ‌లోకి కారు దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో మ‌హిళ మృతి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>