Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుని బాలింత మృతి

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ మ్యాచ్ ఓ బాలింత మరణానికి కారణమైంది. ఈనెల 5వ తేదీన హైదరాబాద్ (Hyderabad) ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ అనంతరం ఏర్పడిన ట్రాఫిక్ జామ్ లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. గంటకు పైగా ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. నేపాల్ నుంచి బతుకుదెరువు కోసం సురేశ్, బిష్ణ (30) దంపతులు హైదరాబాద్ (Hyderabad)కు వచ్చి ఘట్ కేసర్ లో నివాసం ఉంటున్నారు.  బట్టల దుకాణంలో పనిచేస్తున్న బిష్ణకు ఆదివారం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను సమీపంలోని ఆస్ప్రతికి తీసుకెళ్లగా డాక్టర్లు నిమ్స్ కు రిఫర్ చేశారు. బిష్ణను అంబులెన్స్ లో తరలిస్తుండగా ఉప్పల్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ వల్ల భారీ ట్రాఫిక్ ఏర్పడింది.

దారి ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు ఎంత ప్రాధేయపడ్డా ఒక్కబండి కూడా ముందుకు కదలలేదు. దాదాపు గంటకు పైగా అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో ఆక్సిజన్ అయిపోయి బిష్ణ తుది శ్వాస విడిచింది. కాగా, మహిళకు ముగ్గురు పిల్లలు సాగర్ (6), సందీప్ (4), 26 రోజుల పాప ఉంది. బిష్ణ మరణంతో ఈ ముగ్గురు తల్లిలేని అనాథలయ్యారు. అయితే, ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం ఉందని, అంబులెన్స్ కు దారి ఇవ్వకపోవడం వల్లే బాలింత ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు పెద్ద ఈవెంట్ల సమయంలో అత్యవసర సేవలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>