Liquor Licence |తెలంగాణ వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు అబ్కారీ శాఖ దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 89 వేల దరఖాస్తులు వచ్చాయి. కాగా, వాటికి సోమవారం డ్రా నిర్వహించనున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఇక్కడే అసలు చిక్కుంది. ఇప్పటికే మద్యం దుకాణాల దరఖాస్తు అంశం హైకోర్టులో ఉంది. దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించడంపై మద్యం వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Liquor Licence | ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. గడువును ఏ ప్రాతిపదిక పెంచారని ప్రశ్నించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో మద్యం దుకాణాల ప్రక్రియను రద్దు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే లక్కీ డ్రా తీయాలి అనుకుంటే అక్టోబర్ 18ని కటాఫ్ డేట్‌గా పరిగణించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం లక్కీ డ్రాను ఎలా నిర్వహిస్తారు? అనేది కీలకంగా మారింది. అక్టోబర్ 18ని కటాఫ్‌గా పరిగణిస్తారా? లేదా ఏం చేస్తారు? అనేది తీవ్ర చర్చలకు దారితీస్తోంది.
Read Also: భర్తను హతమార్చిన భార్య.. ఎందుకంటే..!

