కలం, నిజామాబాద్ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకుల వద్ద లక్షలు వసూలు చేసిన మాయ లేడీపై పోలీసులు కేసు నమోదు (Fraud Case) చేశారు. బాధితులు రాజు, శ్రీనివాస్ లు నిజామాబాద్ (Nizamabad) నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ పట్టణానికి చెందిన రమావత్ రాజు డిగ్రీ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. రాజుకు శ్రీనివాస్ అనే స్నేహితుడి ద్వారా గొబ్బి స్వరూప పరిచయమైంది. తాను ఆర్అండ్ బీ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నట్టు స్వరూప చెప్పుకుంది.
ఆర్ అండ్ బీ శాఖలోనే జానియర్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తానని రాజు వద్ద రూ.4 లక్షలు, శ్రీనివాస్ దగ్గర రూ.7 లక్షలు తీసుకుంది స్వరూప. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏడాదిగా మభ్యపెడుతూ వస్తోంది. స్వరూప మోసం (Fraud Case) చేసిందని గ్రహించిన రాజు, శ్రీనివాస్ తమ డబ్బు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండి… డబ్బు తిరిగివ్వను అంటూ స్వరూప బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వారు వివరించారు. తమ డబ్బులు ఇప్పించాలని వారు కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో దళారులను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: ‘సోషల్ వార్’.. జాన్వీకపూర్ వర్సెస్ ధ్రువ్ రాఠీ
Follow Us On: Pinterest


