కలం, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల గురించి బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇన్ఫ్లుయెన్సర్, వ్లాగర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) పరోక్షంగా ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు శుక్రవారం పరోక్షంగా ఆమెపై పోస్టులు పెట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. జాన్వీ కపూర్ వ్యతిరేకంగా, మద్దతు సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఆమెను ఫేక్ బ్యూటీ అంటూ పరోక్షంగా ధ్రువ్ రాఠీ పేర్కొన్నాడు. అంతేకాదు, జాన్వీకపూర్ ఉన్న పోస్టర్‌ను ‘ఫేక్ బ్యూటీ’ అంటూ ట్వీట్ చేశాడు.
అందులో జాన్వీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోకముందు తీసుకున్న ఫొటో ఉంది. అంతేకాదు, బాలీవుడ్ సెలెబ్రిటీల బయటికి కనిపించే అందం ఇది. లోపలి అందం, గుణం వేరొకటి అనే కోణంలో అర్థం వచ్చేలా రాశాడు. దీనిపై ధ్రువ్ రాఠీకి (Dhruv Rathee) మద్దతుగా వివిధ దేశాల నుంచి కొందరు మత కోణంలో పోస్టులు పెడుతున్నారు. దీని కౌంటర్‌గా బీజేపీ లీడర్స్‌తో పాటు మరికొందరు జాన్వీకి సపోర్టుగా మాట్లాడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.
Read Also: బాప్రే.. ఒక్కడే ఇన్‌స్టామార్ట్‌లో రూ.22లక్షలు ఖర్చు చేశాడు!
Follow Us On: X(Twitter)


