మహబూబాబాద్(Mahabubabad) జిల్లా బయ్యారం మండలం రాయికుంట గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తనకు వికలాంగుల పెన్షన్ ఇప్పించాలంటూ ఓ యువతి ఎమ్మెల్యేను కాళ్లపై పడి ప్రాథేయపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు మాటలు రావు, చెవులు వినపడవని పెన్షన్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య(Koram Kanakaiah) కాళ్ళ మీద పడి ప్రాధేయపడిందామే. అయినా ఎమ్మెల్యే కోరం కనకయ్య కనికరించలేదు. రెండేళ్ల నుండి పెన్షన్ కోసం తిరుగుతున్నా ఇస్తలేరని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు మంజుల. తాను పుట్టుకతోనే మూగ చెవుడు అని, రెండేళ్ళ క్రితం భర్త గుండెపోటుతో చనిపోయాడని, పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

