ఆంధ్రప్రదేశ్ కాకినాడ(Kakinada) జిల్లాలో ఓ టీడీపీ నేత చేసిన పని తీవ్ర కలకలం రేపుతోంది. తాతని అవుతా అంటూ ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకెళ్లిన టీడీపీ నేత నారాయణరావు.. ఆ బాలికపై అత్యాచారానికి యత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన సమయంలో స్థానికుడు ఒకరు ప్రశ్నించడంతో వారిపై నారాయణ వాగ్వాదానికి దిగారు. తాను మున్సిపల్ కౌన్సిలర్ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అసలు అమ్మాయిని తొటలోకి తీసుకొచ్చి.. బట్టలు విప్పించే ఏం చేద్దామనుకుంటున్నావ్ అని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడు నారాయణరావు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. హోంమంత్రి వంగలపూడి అనిత అనుచరుడే ఈ నారాయణ రావు అని సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. పలు ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
Kakinada | ఈ ఘటనపై స్పందించిన బాలిక కుటుంబీకులు.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు చెప్పకుండా బాలికను ఎలా పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలకు చెందిన టీచర్ మాత్రం తాను కొత్తగా చేరానని, ఆయన వచ్చి అమ్మాయి తాతయ్యను అని చెప్పడంతోనే పంపానని పాఠశాలలోని టీచర్ చెప్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలను రేకెత్తిస్తోంది. నారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: చిన్నారిపై అత్యాచారం.. కఠిన శిక్ష విధించిన కోర్టు

