‘డూడ్’ సినిమాపై ఇళయరాజా(Ilayaraja) కోర్టును ఆశ్రయించారు. తాను స్వరపరిచిన రెండు పాటలను ఈ సినిమా యూనిట్ తగిన అనుమతులు లేకుండా వినియోగించిందంటూ ఇళయరాజా పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌ను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు.. ఇళయరాజాకు ఓకే చెప్పింది. మూవీ టీమ్, ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్(Sony Music)పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతించింది. దీంతో చర్యలకు ఇళయరాజా రెడీ అయ్యారు. అయితే ఇళయరాజా ఇప్పటికే పలువురికి తన పాటల విషయంలో వార్నింగ్ ఇచ్చి ఉన్నారు. తన మాటలను తన అనుమతి లేకుండా వినియోగిస్తే కోర్టుకు వెళ్తానని చెప్పారు. ఇంతలో ఇప్పుడు ‘డూడ్’పై లీగల్ యాక్షన్‌కు రెడీ అయ్యారు.
కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా తెరకెక్కిన ఈ మూవీకి తెలుగులో కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అక్టోబర్ 17న విడుదలైన ఈ మూవీ.. మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఇందులో తన పాటలను వాడారని ఇళయరాజా కోర్టుకు వెళ్లారు. గతంలో ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ‘కూలీ’ తదితర సినిమాల నిర్మాణ సంస్థలకు కూడా ఇళయరాజా(Ilayaraja) గతంలో లీగల్ నోటీసులు పంపారు.
Read Also: అల్లూ శిరీష్‌కు కాబోయే భార్యను చూశారా..!

