విశాఖ ఎక్స్ ప్రెస్‌లో దారుణం!

కలం, వెబ్‌డెస్క్: విశాఖ ఎక్స్‌ప్రెస్ (Visakha Express) రైలులో ఓ వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లాకు చెందిన భార్యాభర్తలు విశాఖ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలు గుడివాడ – విజయవాడ మధ్యలో ఉన్నప్పుడు, ఓ గుర్తుతెలియని వ్యక్తి ఏసీ భోగీలో సీటు ఖాళీ ఉందని చెప్పాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మి ఆ వివాహిత H1A బోగీలోకి వెళ్లింది.

ఈ సమయంలో నిందితుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు నడికూడలో రైలు దిగిన తర్వాత భర్తకు విషయం చెప్పడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR) నమోదు చేసి, కేసును విజయవాడ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. రైలు ప్రయాణాల్లో మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>