కలం, వెబ్ డెస్క్ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy)కి తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. గతంలో ఉన్న షరతులతో కూడిన బెయిల్ ను సడలిస్తూ న్యాయస్థానం తాజాగా పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు తాజా నిర్ణయంతో ఆయనకు ఏపీకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది.
చాలా కాలం తర్వాత భాస్కర్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్తుండటంతో అక్కడ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఆయన రాకతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

