‘నాకు పిల్లలు అక్కర్లేదు. ప్రియుడే కావాలి’ అని ఓ మహిళ తెగేసి చెప్పడంతో ఏం చేయాలో పోలీసులు, పెద్దలకు కూడా పాలుపోలేదు. ఈ ఘటన పల్నాడు(Palnadu) జిల్లాలో జరిగింది. భర్తతో విభేదాలు ఉన్న క్రమంలో ప్రియుడితో కలిసి వెళ్లిపోవడానికి సదరు మహిళ డిసైడ్ అయింది. అందుకు అడ్డుగా ఉన్న పిల్లలను నడిరోడ్డుపై వదిలేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో చేసేదేమీ లేక.. పిల్లలను వెంటబెట్టుకుని కుటుంబీకులు పిడుగురాళ్ల పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు మహిళను పిలిపించారు. ఇద్దరు పిల్లలను వదిలి ఇక్కడికి వచ్చి ఉండటం సరైన పద్దతి కాదని, పిల్లల జీవితాలు పాడవుతాయని పోలీసులు నచ్చజెప్పారు. పెద్దలు కూడా అదే చెప్పారు. కానీ మహిళ మాత్రం తిరిగి భర్త దగ్గరకు వెళ్లడానికి నిరాకరించింది. భర్తతో కలిసి వెళ్లనంటే వెళ్లనని ఆమె తెగేసి చెప్పడంతో ఎవరికీ ఏం చేయాలో అర్తం కాలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు.
Palnadu | పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయనగరంకు చెందిన ఓ మహిళకు తన భర్తతో తరచూ గొడవ పడుతుండేది. వారి మధ్య విభేదాలుకు కొదవ ఏమీ లేదు. అదే సమయంలో తుమ్మలచెరువు గ్రామానికి చెందిన రాజేశ్ అనే వ్యక్తితో ఆమెకు ఆన్‌లైన్‌లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఐదు నెలల క్రితం ఆమె తన కుటుంబ సభ్యులు, పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి ఉండటానికి తుమ్మలచెరువుకు వెళ్లింది. ఆ విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు పిల్లలను తీసుకుని పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అప్పుడు ఆమెను ఎలాగోలా ఒప్పించి తిరిగి తీసుకొచ్చారు. కానీ వారం క్రితం మళ్ళీ ఆమె తన ప్రియుడు రాజేష్ దగ్గరకు చేరుకుంది. దీంతో ఆమె కుటుంబీకులు మరోసారి పోలీసుల దగ్గరకు చేరుకున్నారు. అయితే ఈసారి భర్త దగ్గరకు రానంటే రానని ఆమె తేల్చి చెప్పడంతో ఏం చేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు.

