ఓ మహిళ చేసిన పనికి ఒక తండ్రి.. నాలుగు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నలుగు పిల్లలతో కలిసి తండ్రి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడారు. తన ఆత్మహత్యను వీడియో రికార్డ్ కూడా చేశాడా వ్యక్తి. అనంతరం ఆ వీడియోను తన సోదరికి షేర్ చేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లో చోటుచేసుకుంది. తన, తన పిల్లల మరణానికి తన భార్య, ఆమె ప్రియుడే కారణమని ఆ వ్యక్తి వివరించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సల్మాన్, ఖుష్నూకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి మహక్ (12), షిఫా (5), అమన్ (3), ఎనిమిది నెలల శిశువు ఇనైషా పిల్లలు కూడా ఉన్నారు.
అయితే ఖుష్నూ మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుంది. ఈ విషయం తెలియడంతో శుక్రవారం సల్మాన్‌కు ఖుష్నూకు మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఖుష్నూ తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. తన భార్య.. లవర్‌తో కలిసి లేచిపోవడంతో భర్త.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. మనస్థాపం కలగడంతోనో, సమాజంలో తన పరువు పోయిందనుకునో ఏమో కానీ తన నలుగురు పిల్లలను తీసుకుని భర్త యుమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Uttar Pradesh | తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ సల్మాన్ ఓ వీడియోను రికార్డ్ చేశాడు. తన భార్య, ఆమె లవర్ కారణంగానే తాము చనిపోతున్నామని వీడియోల వివరించాడు. ఆ వీడియోను తన సోదరి గులిస్టాకు పంపాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. డైవర్లతో యమునా నది(Yamuna River)లో గాలింపు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

