కలం, సినిమా: రుద్రమదేవి, శాకుంతలం వంటి భారీ ఇతిహాసిక చిత్రాలు రూపొందించిన దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar).. అంతా కొత్త వాళ్లతో యుఫోరియా అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాకు ముందు హిరణ్యకశ్యప అనే చిత్రాన్ని గుణశేఖర్ ప్లాన్ చేయడం, ఆ సినిమాను రానా అనౌన్స్ చేయడంతో వివాదంగా మారిన విషయం తెలిసిందే. దాంతో గుణశేఖర్ రానాను నిన్ను దేవుడే చూసుకుంటాడు అని విమర్శించి ఆ ప్రాజెక్ట్ వదిలేశాడు. ఆ తర్వాత మొదలైందే ఈ యుఫోరియా (Euphoria).
యుఫోరియా సినిమా నేటితో సరిగ్గా నెల రోజులకు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఒకటి ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియడం లేదు. యుఫోరియా అంటేనే ఒక క్రేజ్, టైటిల్ లో ఉన్న ఆ క్రేజ్ సినిమాకు రావడం లేదు. ఇందుకు అంతా కొత్తవాళ్లు కావడం ఒక రీజన్ అయితే, గుణశేఖర్ గత సినిమా శాకుంతలం బాక్సాపీస్ వద్ద నిరాశపర్చడం మరో కారణం. పైగా యుఫోరియా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన గ్లింప్స్, హైఫై పాటకు గానీ పెద్దగా ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ రాలేదు.
చెప్పాలంటే గుణశేఖర్ సినిమాలన్నీ అండర్ డాగ్ లుగానే ఉంటాయి. రిలీజై థియేటర్స్ లో టాక్ బాగుంటే గానీ ఆ సినిమాకు జనం కదలరు. రుద్రమదేవి విషయంలో ఇదే జరిగింది. ఆ తర్వాత శాకుంతలం దిల్ రాజు ప్రొడక్షన్ లో భాగమై ప్రమోట్ చేసినా ఫలితం దదక్కలేదు. తాజాగా యుఫోరియా సినిమా 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రీసెంట్ గా దురంధర్ మూవీలో నటించి హీరోయిన్ గా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న సారా అర్జున్ ఫొటోను ఆ పోస్టర్ పై పెద్దగా డిజైన్ చేశారు. దురంధర్ తో వచ్చిన సారా అర్జున్ ఫేమ్ ను తమ యుఫోరియా సినిమాకు ఉపయోగించుకునేందుకు గుణశేఖర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
యూత్ డ్రగ్స్ బారిన పడి ఎలా దారి తప్పుతున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పే కథాంశంతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు గుణశేఖర్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయనే గుణ హ్యాండ్ మేడ్ ఫిలింస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిన్న సినిమా తనకు పెద్ద సక్సెస్ ఇస్తుందనే నమ్ముతున్నారు గుణశేఖర్ (Gunasekhar). మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
Read Also: చిరు, ప్రభాస్ సినిమాల టికెట్స్ ధర పెంపునకు లైన్ క్లియర్!
Follow Us On: Instagram


