epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బాహుబలి 2 రికార్డ్‌ను ధురంధర్ బ్రేక్ చేస్తుందా?

కలం, వెబ్ డెస్క్: దురంధర్ (Dhurandhar) సినిమా రికార్డుల మోత మోగిస్తున్నది. ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన చర్చే జరుగుతోంది. అయితే ధురంధర్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా? అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి సినిమా ఓ చరిత్ర. ఒక కథను రెండు పార్టులుగా చెప్పి.. దర్శకధీరుడు రాజమౌళి చరిత్ర సృష్టించారు. ఇక అక్కడ నుంచి ఒక కథను రెండు పార్టులుగా చెప్పడం అనేది ట్రెండ్ అయ్యింది. అయితే.. బాహుబలి 2 సెట్ చేసిన రికార్డ్ ను ఇంత వరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పుడు బాలీవుడ్ మూవీ ధురంధర్.. బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేయనుందని టాక్. ఇంతకీ.. బాహుబలి 2 సెట్ చేసిన రికార్డ్ ఏంటి..? ధురంధర్ నిజంగానే ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా..?

బాహుబలి సెన్సేషన్ అయితే.. బాహుబలి 2 హిస్టరీ. బాహుబలి 2 సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. దీంతో 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. బాహుబలి 2 తర్వాత నుంచి ఒక కథను రెండు పార్టులుగా చెప్పడం.. అనేది ట్రెండ్ గా మారింది. బాహుబలి స్పూర్తితోనే.. పుష్ప, పుష్ప 2, కేజీఎఫ్, కేజీఎఫ్ 2, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2.. ఇలా సీక్వెల్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే.. ఎన్ని సినిమాలు వచ్చినా.. ఏ భాష నుంచి సినిమాలు వచ్చినా బాహుబలి 2 సెట్ చేసిన రికార్డ్ ను మాత్రం ఏ మూవీ కూడా బ్రేక్ చేయలేకపోయింది. మరి ధురంధర్ (Dhurandhar) బ్రేక్ చేస్తుందా?

ఇంతకీ బాహుబలి 2 సెట్ చేసిన రికార్డ్ ఏంటంటే… ఓవర్ సీస్ లో బాహుబలి 2.. 20.7 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఆతర్వాత ఇప్పటి వరుకు ఏ సినిమా వచ్చినా కూడా దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి. అయతే.. ఇప్పుడు బాలీవుడ్ లో ధురంధర్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఇప్పటి వరకు 19 మిలియన్స్ కలెక్ట్ చేసి బాహుబలి 2 తర్వాత స్థానం దక్కించుకుంది. ధురంధర్ స్పీడు చూస్తుంటే.. బాహుబలి 2 ను క్రాస్ చేసేట్టే ఉంది. మరి.. ధురంధర్ బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>