కలం వెబ్ డెస్క్: ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి (Deepak Reddy) ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటారు. కొంతకాలం క్రితం ఇండిగో సంక్షోభం సమయంలో నేషనల్ మీడియాలో అప్రస్తుత ప్రసంగం చేసి టీడీపీకి చిక్కులు తెచ్చి పెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న తనకు కొన్ని నెలలుగా వేతనం ఇవ్వడం లేదంటూ Deepak Reddy వ్యాఖ్యానించారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీపక్ రెడ్డికి శాలరీ ఎందుకు పడలేదు? అన్న అంశం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లినట్టు సమాచారం. దీంతో ఆయనకు తాజాగా వేతనం క్రెడిట్ అయ్యింది. తాను ఎన్ని సార్లు చెప్పినా సంబంధిత ఫైల్‌ను క్లియర్ చేయడం లేదని ఆయన ఆరోపించారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు జీతం పడటం లేదన్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం జీతం విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. అయితే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న దీపక్ రెడ్డి ఇంతకాలం వేతనం ఎందుకు పెండింగ్ లో ఉంది. ఆయనతోపాటూ ఇంకా ఎవరికైనా పెండింగ్ లోనే ఉందా? ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉందా? లేదంటే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ఆపారా? ఆర్థిక పరమైన సర్దుబాటు జరగలేదా? అన్నది తెలియాల్సి ఉంది.


