కలం, వరంగల్ బ్యూరో: ములుగు (Mulugu) జిల్లా వెంకటాపురం తహసీల్దార్ గిరిబాబు పై భార్య ఝాన్సీ రాణి హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. వేరే మహిళతో వివాహేతరసంబంధం పెట్టుకుని తన పిల్లలను తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను పట్టించుకోకుండా వేరే మహిళతో సహజీవనం చేస్తున్న ఎమ్మార్వో పై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. తమతో కాకుండా వేరే మహిళతో డాడీ ఉండడం పట్ల మానసికంగా కృంగిపోతున్నామని ఎమ్మార్వో పిల్లలు పేర్కొన్నారు. కాగా, తనకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో సహజీవనం చేయడం ఎంతవరకు సమంజసమని బాధితురాలు పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: కేరళలో రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే: హరీశ్ రావు
Follow Us On: Pinterest

