దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, అధికారులు, కురుమ సంఘం ప్రతినిధులు హాజరై అమరుడు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. ఆయన త్యాగం ప్రజల హక్కుల కోసం జరిగిన గొప్ప పోరాటానికి ప్రేరణగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మహానుభావుడు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాష్, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, కురుమ సంఘం ట్రస్ట్ ప్రెసిడెంట్ చిగుర్ల శ్రీనివాస్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎగుర్ల అశోక్, మహిళా అధ్యక్షురాలు కర్రె పావని, మీసా రమాదేవి, బీసీ సంఘం నాయకురాలు గుంటి స్వరూపతో పాటు కురుమ సంఘం నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: కేరళలో రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే: హరీశ్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>