కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) విలాసవంతమైన జీవితం కొనసాగిస్తారనే విషయం తెలిసిందే. ఆయన లగ్జరీ లైఫ్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. అంతకంటే తన అలవాట్లకు ప్రయారిటీ ఇస్తారు. సాధారణంగా సెలబ్రిటీలు సమయం ఆదా చేసుకోవడానికి ప్రైవేట్ జెట్‌లను ఆశ్రయిస్తుంటారు. కానీ షారుఖ్ విషయంలో మాత్రం మరో ప్రధాన కారణం ప్రచారంలో ఉంది. ఆయనకు ఉన్న ‘చైన్ స్మోకింగ్’ అలవాటే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎక్కువసేపు విమాన ప్రయాణాల్లో స్మోకింగ్ చేయకుండా ఉండటం ఆయనకు ఇబ్బందికరంగా ఉండేదట.
సాధారణ విమానాల్లో ధూమపానంపై కఠినమైన నిషేధం ఉంటుంది. అందుకే సుదీర్ఘ ప్రయాణాల సమయంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు షారుఖ్ కేవలం ప్రైవేట్ జెట్‌లనే (Private Jets) ఎంచుకుంటారని సమాచారం. చార్టర్డ్ ఫ్లైట్స్‌లో కొంత మేర వెసులుబాటు ఉంటుంది. వ్యక్తిగత గోప్యత ఉండటంతో షూటింగ్‌లు, సినిమా ప్రమోషన్లు, వ్యక్తిగత పనుల కోసం ఆయన (Shah Rukh Khan) దాదాపుగా ప్రైవేట్ విమానాలపైనే ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: ఫ్యాన్‌కు తమన్నా స్వీట్ సర్ప్రైజ్.. ఏకంగా ముద్దు ఇచ్చేసిందిగా!
Follow Us On: Instagram

