కలం, వరంగల్ బ్యూరో: జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగి పడటంతో ముగ్గురు కూలీలు (Laborers) దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామానికి చెందిన సుకినే దేవారావు (48), బండారి అభిలాశ్ (16)తోపాటు.. పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడయ్య (53) మృతిచెందారు. సుకినే మోహన్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
Read Also: ముగిసిన మాజీ డీజీపీ హెచ్‌జే దొర అంత్యక్రియలు
Follow Us On: Youtube

