కలం, వెబ్ డెస్క్: నటీనటుల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తమ అభిమాన స్టార్ కనిపిస్తే, ఫ్యాన్స్ సెల్ఫీలు అడగడం సాధారణం. అభిమానుల కోసం కొందరు సెల్ఫీలు ఇస్తే.. మరికొందరు దురుసుగా ప్రవర్తించిన ఘటనలున్నాయి. అయితే సెల్ఫీలు ఇవ్వని ఈ రోజుల్లో తమన్నా (Tamannaah Bhatia) మాత్రం ఏకంగా ఫ్యాన్‌కు ముద్దు (Kiss) ఇచ్చి ఆశ్చర్యపర్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. ‘ముద్దు నాకెప్పుడు ఇస్తాందో తమ్ము’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు తమన్నా స్టార్ సెలబ్రిటీ అనే హోదాను పక్కన పెట్టి డ్యాన్స్ పట్ల ఉన్న మక్కువను చాటుకుంటోంది. సాధారణంగా అగ్ర హీరోయిన్లు సినిమాలకే పరిమితమవుతారు, కానీ తమన్నా మాత్రం ప్రైవేట్ ఈవెంట్లలో, వేడుకల్లో పాల్గొంటూ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఆమె వేస్తున్న స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-తమన్నా భాటియాకు లేడీ ఫ్యాన్ కిస్
-తిరిగి ప్రేమగా కిస్ చేసిన తమన్నా!
-ప్రస్తుతం ఈ వీడియో #SocialMedia లో వైరల్!
A lady Fan of Tamannaah Bhatia kissed her and she kissed back#TamannaahBhatia #Tamannaah #TamannaahFans #TamannaahViralVideo #TamannaahCuteMoment#TamannaahFanMoment… pic.twitter.com/dO4d6IllPO— Kalam Daily (@kalamtelugu) March 14, 2026
Read Also: మరోసారి తల్లైన టాలీవుడ్ నటి
Follow Us On: Instagram

