అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఫెయిల్ ..అసలు కారణం ఏమిటి?

కలం, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు (US Iran Peace Talk)  ఫెయిల్ అయ్యాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. చర్చలు సఫలం అవ్వాలని.. యుద్ధం ఆగిపోవాలని అంతా కోరుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా అమెరికా నుంచి ప్రకటన వచ్చింది. చర్చలు విఫలం అయినట్టు అమెరికా ప్రకటించింది. అసలు ఈ చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? ఇరాన్ పెట్టిన షరతులు ఏమిటి? అమెరికా పెట్టిన నిబంధనలు ఏమిటి? ఎక్కడ ఇరు దేశాల మధ్య తేడా కొట్టింది అన్న చర్చ మొదలైంది. ఏప్రిల్ 11 (శనివారం)న ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు చర్చలు కొనసాగాయి. ఈ చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిశాయి. అమెరికా తరఫున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహించారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌కు ఇది బ్యాడ్ న్యూస్ అంటూ వ్యాఖ్యానించారు. తమ బృందం ఇరాన్‌కు “ఫైనల్ అండ్ బెస్ట్ ఆఫర్” ఇచ్చి వెళ్తున్నట్లు తెలిపారు.

అసలు సమస్య అదేనా?

చర్చలు ఎందుకు ఫెయిల్ అయ్యాయో వాన్స్ బయటకు చెప్పలేదు. అయితే ఇరాన్ అణు ఆయుధాల తయారీ విషయంలో వెనక్కి తగ్గకపోవడమే అసలు కారణమని తెలుస్తోంది. తాము అణ్వాయుధాలు తయారు చేయబోమని.. అందుకు సంబంధించిన వనరులు సమకూర్చుకోబోమని ఇరాన్ స్పష్టమైన ప్రకటన చేయలేదని వాన్స్ వ్యాఖ్యానించారు. ఇరాన్ ను అణ్వాయుధాలు తయారు చేయకుండా నిలువరించడమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యమని వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ యురేనియం సమృద్ధి నిల్వలు ఇప్పటికే ధ్వంసమయ్యాయని వాన్స్ తెలిపారు. కానీ ఇరాన్ దీర్ఘకాలికంగా అణ్వాయుధాలు తయారు చేయబోం అని ప్రకటించడం లేదని వాన్స్ పేర్కొన్నారు. అమెరికా అసంబద్ధ డిమాండ్లు తెరమీదకు తెస్తోందని అందుకే చర్చలు సఫలం కాలేదని ఇరాన్ మీడియా చెబుతోంది. అమెరికా షరతులు అంగీకరించడానికి ఇరాన్ సిద్ధంగా లేదని ఇరాన్ ప్రతినిధులు అంటున్నారు. హర్మూజ్ జలసంధి సమస్య కూడా చర్చల్లో ఒక ముఖ్యమైన అంశమని ఇరాన్ మీడియా తెలిపింది.

ఇరాన్ ఓడిపోయింది: ట్రంప్

మరోవైపు ట్రంప్ మాత్రం ఇరాన్ ఇప్పటికే దారుణంగా ఓడిపోయిందని చెప్పుకుంటున్నారు. చాలా మిస్సైల్స్, తయారీ సామర్థ్యాలు నాశనమయ్యాయని, అమెరికా సైన్యం అద్భుతంగా పని చేసిందని ట్రంప్ అన్నారు. కాగా రెండు దేశాల మధ్య ఇంకా రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. ఈ రెండు వారాల్లో చర్చలు జరిగే అవకాశం ఉందా? రెండు దేశాలు మెట్టు దిగుతాయా? యుద్ధం ఆగుతుందా? అన్న చర్చ సాగుతోంది.

Read Also: మళ్లీ టీఆర్ఎస్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>