కలం, సినిమా : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (NTR – Trivikram).. ఈ ఇద్దరి కాంబోలో మూవీ అనౌన్స్ చేయడం తెలిసిందే. అయితే.. ఊహించని విధంగా ఈ కాంబో మూవీ క్యాన్సిల్ అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదే అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇంతకీ.. ఈ సినిమా చేతులు మారడానికి కారణం ఏంటి..? దీని వెనుక ఏం జరిగింది..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలి అనుకున్నారు. కథ రెడీ అయ్యింది.. తీయడానికి త్రివిక్రమ్ రెడీగా ఉన్నారు. కాకపోతే.. చేస్తాడనుకున్న బన్నీ.. మనసు మారింది. త్రివిక్రమ్ తో కాకుండా అట్లీతో సినిమా చేయాలి అనుకున్నాడు. అంతే.. బాగా ఫీలైన త్రివిక్రమ్ ఎన్టీఆర్ (NTR Trivikram) కు వెళ్లి కథ చెప్పడం.. ఎన్టీఆర్ ఓకే అనడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకీతో ఆనంద నిలయం అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
వెంకీతో మూవీ కంప్లీట్ అయిన తర్వాత NTR తో మైథలాజికల్ మూవీ స్టార్ట్ చేస్తాడు అనుకుంటే.. మళ్లీ ఇది బన్నీకి దగ్గరకు వెళ్లిందనే వార్త లీకైంది. తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే.. ఎన్టీఆర్ దేవర 2 చేయాలి. దేవర 1 రిజెల్ట్ అనుకున్న విధంగా రాలేదు. అందుకని దేవర 2 ఉండదు అనుకున్నారు కానీ.. ఎన్టీఆరే స్వయంగా ఉంటుందని అభిమానుల సమక్షంలో ప్రకటించారు. గత కొంతకాలంగా కొరటాల దేవర 2 కథ పైనే కసరత్తు చేశారు. ఈ కథ బాగా వచ్చిందట. ఇటీవల కొరటాల నెరేషన్ ఇచ్చారని.. కథ విని ఎన్టీఆర్ వెంటనే ఈ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారని టాక్. ముందుగా దేవర 2 చేసి ఆతర్వాత త్రివిక్రమ్ తో సినిమా అంటే బాగా లేట్ అవుతుందనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ మళ్లీ బన్నీ దగ్గరకు వచ్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Read Also: 2025 టాప్ 10 మూవీస్ ఇవే..
Follow Us On: Instagram


